ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలతో పోరాడుతున్న ప్రియురాలు

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 20:29
lovers-suicide-attempt-rajampet-kadapa-district

కడప జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది.  కుటుంబసభ్యులు తమ పెళ్ళికి ఒప్పుకోలేదన్న కారణంగా రైలు కింద పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా. ప్రియురాలు ప్రాణాలతో పోరాడుతోంది. కడపకు చెందిన ఖాసింబీ, విజయవాడకు చెందిన సిద్దయ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు తెలిసి మందలించారు. ఈ క్రమంలో పెళ్ళికి కూడా నిరాకరించారు. దాంతో మనస్థాపం చెందిన సిద్దయ్య , ఖాసింబీ.. రాజంపేట రైల్వే స్టేషన్ స్సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సిద్దయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. గాయపడిన ఖాసింబీని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

English Title
lovers-suicide-attempt-rajampet-kadapa-district

MORE FROM AUTHOR

RELATED ARTICLES