ప్రేమజంట ఆత్మహత్య

Submitted by nanireddy on Sun, 07/29/2018 - 11:20
lovers-commit-suicide-prakasam-district

ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్య  చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో చోటుచేసుకుంది.  యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్‌పీరా (20) బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు.ఇతని ఇంటికి ఎదురుగా ఉండే డి.అరుణబీ (16) యర్రగొండపాలెం సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వీరిల్లులు రెండు ఎదురెదురుగా ఉండటంతో వారి మధ్య సన్నిహితం ఏర్పడి కొంతకాలానికి ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. అయితే ఇటీవల వీరివ్యవహారం కుటుంబసభ్యులకు తెలిసి మందలించారు. ఈ క్రమంలో అరుణ్‌బీకి ఇటీవల ఆమె కుటుంబసభ్యులు మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పెళ్లి ఇష్టం లేక అరుణబీ.. హుస్సేన్‌పీరా ఇద్దరు కలిసి రెండు రోజుల కిందట ఇంటినుంచి పారిపోయారు. కుటుంబసభ్యులు వీరికోసం వెతుకులాట ప్రారంభించగా.. పెద్దారవీడు  కొండప్రాంతంలోని ఆలయం వద్దకు వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English Title
lovers-commit-suicide-prakasam-district

MORE FROM AUTHOR

RELATED ARTICLES