రెండున్నర గంటలు నడి ఎండలో ఇలా..!

రెండున్నర గంటలు నడి ఎండలో ఇలా..!
x
Highlights

తిరువనంతపురం: కేరళలో ఇటీవల కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. పయ్యనూరులో జరుగుతున్న ఈ శోభాయాత్రలో ఆకు ఆకారంపై...

తిరువనంతపురం: కేరళలో ఇటీవల కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు. పయ్యనూరులో జరుగుతున్న ఈ శోభాయాత్రలో ఆకు ఆకారంపై చిన్ని కృష్ణుడు కూర్చున్నట్లుగా ఓ బాలుడు కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఆ బాలుడిని మధ్యాహ్నం సమయంలో ఆకుపై కృష్ణుడి వేషధారణలో పడుకోబెట్టారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆ బాలుడు అలానే పడుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీకాంత్ ఉషా ప్రభాకరన్ అనే స్థానికుడు ఫేస్‌బుక్‌లో పెట్టడంతో విషయం బయటకు పొక్కింది. మొదట చూడగానే కృష్ణుడి శిల్పమనుకున్నానని, చేతులూకాళ్లూ కదిలిస్తుండటంతో బాలుడిగా గుర్తించినట్లు తెలిపాడు.

ఎండ వేడిమిని నుంచి తప్పించుకోవడానికి ఆ బాలుడు చేతులను ముఖానికి అడ్డం పెట్టుకోవడాన్ని గమనించినట్లు చెప్పాడు. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశానని.. కానీ ఫోన్ మాట్లాడిన వ్యక్తి దారుణంగా మాట్లాడాడన్నాడు. ఆ పిల్లాడు కానీ, తల్లిదండ్రులు కానీ ఫిర్యాదు చేయాలని, వాళ్లకి లేని బాధ మీకేంటంటూ నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు ప్రభాకరన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. పోలీసులు కూడా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారని ప్రభాకరన్ పోస్ట్‌లో తెలిపాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories