హైదరాబాదీలను నోరూరిస్తున్న హలీం

హైదరాబాదీలను నోరూరిస్తున్న హలీం
x
Highlights

హైదరాబాద్‌లో హలీం సందడి మొదలైంది. రంజాన్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో హలీం అమ్మకాలు ఊపందుకున్నాయి. సిటీ సిటిజన్స్‌ తమ ఫేవరెట్‌ ఫుడ్‌ని లొట్టలేసుకుని మరీ...

హైదరాబాద్‌లో హలీం సందడి మొదలైంది. రంజాన్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో హలీం అమ్మకాలు ఊపందుకున్నాయి. సిటీ సిటిజన్స్‌ తమ ఫేవరెట్‌ ఫుడ్‌ని లొట్టలేసుకుని మరీ తింటున్నారు. నాన్‌వెజ్‌తో పాటు వెజ్‌ హలీం కూడా లభిస్తోంది. దీంతో హలీం సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. రంజాన్‌ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది హలీం. ఏడాదికోసారి కేవలం నెల రోజుల పాటు లభించే ఫేవరెట్‌ ఫుడ్‌ కోసం జనాలు ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తుంటారు. మరీ ముఖ్యంగా హైద్రాబాదీల్లో హలీంకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

కేవలం ముస్లింలే కాకుండా అన్నీ వర్గాల ప్రజలు హలీంను అమితంగా ఇష్టపడతారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పాటు, నాణ్యమైన మాంసంతో తయారు చేసే హలీంలో మంచి పోషక విలువలు ఉంటాయి. దీంతో ఈ ఫుడ్‌కి విపరీతంగా డిమాండ్‌ ఉంటుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్‌ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో హలీం సెంటర్లు ఏర్పాటయ్యాయి. ప్రతి గల్లీలోని ప్రధాన కూడళ్లలో హలీం సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. హైఫై రెస్టారెంట్ల నుంచి గల్లీలోని హలీం సెంటర్ల వరకు మంచి గిరాకీ ఉంటుంది. ఇందులో చికెన్‌, మటన్‌తో పాటు వెజ్‌ కూడా లభిస్తుంది. హైదరాబాద్‌ హలీం ఇక్కడే కాదు.. విదేశాల్లోనూ చాలా ఫేమస్‌. ఇక్కడ తయారు చేసిన హలీంను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారంటే దీనికున్న క్రేజ్‌ ఎంతో అర్థం చేసుకోవచ్చు. మరెందుకాలస్యం హైద్రాబాదీలు ఈ నెల రోజుల పాటు తమకు ఇష్టమైన హలీంను ఎంజాయ్‌ చేస్తూ టేస్ట్‌ చేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories