కోడ్‌ను డీకోడ్‌ చేస్తూ.. బదిలీ ఉత్తర్వులు

కోడ్‌ను డీకోడ్‌ చేస్తూ.. బదిలీ ఉత్తర్వులు
x
Highlights

ఏపీలో కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ బదిలీ వ్యవహారం తాజా వివాదంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో బదిలీలపై నిషేధం ఉంటుంది. అయితే దానికి...

ఏపీలో కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ బదిలీ వ్యవహారం తాజా వివాదంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో బదిలీలపై నిషేధం ఉంటుంది. అయితే దానికి విరుద్ధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ నెల 18 న శివ శంకర్ ని తన మాతృ శాఖ ప్రణాళికా విభాగానికి పంపింది. కనీసం ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తీస్కొకపోవడం పై ఈసీ సీరియస్ గా ఉంది. దీనిపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను వివరణ కోరనుంది. అయితే రాజకీయ ఒత్తిళ్ల మేరకే ఈ బదిలీ జరిగిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసీ స్పందనపై ఆసక్తి నెలకొంది ఉంది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిన్న పోలవరం ప్రాజెక్టు మీద సమీక్ష జరపడం, పోలీస్ శాఖ మీద సమీక్ష జరిపేందుకు ప్రయత్నించడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. తాజాగా రాష్ట్ర కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శివశంకర్ ని బదిలీచేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని పలువురు అధికారులు అంటున్నారు.

వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులో వున్నప్పుడు అవసరమైతే సిఈఓ చెయ్యాలి లేదా ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని మాత్రమే అధికారులను లేదా ఉద్యోగులను బదిలీ చెయ్యాల్సి ఉంటుంది. అలాంటిది ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా శివశంకర్ ని జిఓ ద్వారా బదిలీ చెయ్యటం పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని అధికారులు అంటున్నారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారిని కోడ్ అమలులో ఉండగా తమ అనుమతి లేకుండా బదిలీ చేయడం పట్ల ఎన్నికల సంఘం అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 35 రోజులు సమయం ఉంది. ఈలోగా ఇటు ఎన్నికల కమిషన్ అటు ఆపద్ధర్మ ప్రభుత్వం మధ్య తాము నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories