ఫలించిన టీడీపీ ప్రయత్నం.. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తం ఖరారు

ఫలించిన టీడీపీ ప్రయత్నం.. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తం ఖరారు
x
Highlights

టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న చర్చించాలని బీఏసీ సమావేశంలో స్పీకర్ సుమిత్ర మహాజన్ నిర్ణయించారు. అదే రోజు...

టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న చర్చించాలని బీఏసీ సమావేశంలో స్పీకర్ సుమిత్ర మహాజన్ నిర్ణయించారు. అదే రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి సాయంత్రం వరకూ చర్చ జరపనున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్, టీడీపీ ప్రవేశపెట్టాయి. అయితే, టీడీపీ ముందుగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో నిబంధనల ప్రకారం ఆ తీర్మానాన్ని స్వీకరించినట్టు స్పీకర్ ప్రకటించారు. 50 మందికి పైగా సభ్యులు టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపడంతో చర్చకు కేంద్రం సై అంది. మరోవైపు ఏపీ విభజన చట్టంపై రాజ్యసభలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories