అవిశ్వాస సమరానికి ముహూర్తం ఖరారు

Submitted by arun on Wed, 07/18/2018 - 16:12
no-confidence motion

లోక్ సభలో అవిశ్వాస సమరానికి ముహూర్తం ఖరారైంది. మోడీ సర్కారుపై టీడీపీ ప్రవే పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి చర్చ జరగబోతోంది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్  సమావేశాల మొదటి రోజే  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ  తీర్మానానికి కాంగ్రెస్  పార్టీ మద్దతు తెలిపింది. ఈ తీర్మానాన్ని స్పీకర్  సుమిత్రా మహాజన్ సభలో చదవి వినిపిస్తుండగా టీడీపీ నేతలు, కాంగ్రెస్  పార్టీ నేతలు రాహుల్  గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు లేచి నిలబడి మద్దతు తెలిపారు. అవిశ్వాసానికి 50కి పైగా సభ్యుల మద్దతు లభించడంతో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్  ప్రకటించారు.

టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి చర్చ చేపడతున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అవిశ్వాసంపై చర్చ చేపడతామని తెలిపారు.  ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చర్చ జరుగుతుంది. గత సమావేశాల్లోనూ టీడీపీ, వైసీపీ, అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా అప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అప్పుడు సభా కార్యక్రమాలు తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో ఈసారి చర్చకు అనుమతించడం విశేషం.

2003 తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ స్వీకరించడం ఇదే మొదటిసారి. 2003లో అప్పటి బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ తీర్మానాన్ని స్వీకరించారు. కానీ ఆ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో విపక్షాలు ఓడిపోయాయి.   
 

English Title
Lok Sabha to debate and vote no-confidence motion on Friday

MORE FROM AUTHOR

RELATED ARTICLES