రంగు రంగుల పతంగుల కనువిందు..

రంగు రంగుల పతంగుల కనువిందు..
x
Highlights

పతంగ్ ఫీవరొచ్చేసింది.వందల రకాల మోడల్స్ మురిపిస్తున్నాయి. ముచ్చట పెడుతున్నాయి. పొంగల్‌ సందడి షురు కాకముందే గల్లీ గల్లీలో వేలాడుతూ మెరిసిపోతున్నాయి. గాల్లో ఎగురుతూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.

పతంగ్ ఫీవరొచ్చేసింది.వందల రకాల మోడల్స్ మురిపిస్తున్నాయి. ముచ్చట పెడుతున్నాయి. పొంగల్‌ సందడి షురు కాకముందే గల్లీ గల్లీలో వేలాడుతూ మెరిసిపోతున్నాయి. గాల్లో ఎగురుతూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా కేరింతలు కొడుతున్నారు. వందల వెరైటీలు రంగు రంగుల పతంగులు అప్పుడే ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి.

సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ మునిగిపోయారు. పండగసమీపిస్తుండటంతో సందడే సందడి నెలకొంది. పండగ సంబరాల్లో పతంగుల పండగ గురించి ఇక చెప్పక్కర్లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా చిలుకా పదపదంటూ తెగసందడి చేస్తారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే బుడతలు సైతం పతంగుల పోటీలతో కేకపుట్టిస్తారు. ట్రెండ్‌ మారుతోంది పతంగుల స్టైల్‌ మారింది. జనరేషన్‌ ఐడియాలకు అనుగుణంగా వాటి సైజ్‌, రూపురేఖలు మారాయి. సినీ రాజకీయాల ప్రముఖులతో పాటు వెరైటీ కైట్స్ మార్కెట్లోకి వచ్చాయి. రెండు రూపాయల నుంచి వెయ్యి రూపాలయల వరకు ధరపలుకుతోంది. రేట్లు ఎలాగున్నా పతంగులు ఎగురాల్సిందేనంటోంది యువత. డిఫరెంట్ డిజైన్ల కైట్స్ కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

పతంగుల తయారీకి అడ్డా అయిన పాతబస్తీ. గుల్జార్‌హౌజ్‌, ధూల్‌పేట, మంగల్‌హాట్‌లో వందలాది కలర్‌ఫుల్‌ పతంగులు కనువిందు చేస్తున్నాయి. హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల్లో పతంగుల అమ్మకాలు జోరందుకుంది. కుటీర పరిశ్రమగా ఉపాధి పొందుతున్న తయారీదారులు జనరేషన్‌ ఐడియాకు తగ్గట్లు కైట్స్‌ను తయారు చేస్తూ లాభాలను గడిస్తున్నారు.ఇక హైదరాబాద్‌లో తయారవుతున్న పతంగులకే కాక నార్త్‌ నుంచి తెప్పించిన త్రీడి ప్రింటింగ్‌ పతంగులకు ఫిదా అవుతున్నారు. ప్రధాని నరేంద్రమోడి, రాహుల్‌గాంధీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, కేసీఆర్‌తో పాటు బాహుబలి, డోరెమాన్‌, ఐరన్ మ్యాన్, ఛోటాభీమ్, స్పైడర్ మ్యాన్ కైట్స్ కూడా బాగా సేలవుతున్నాయి. మార్కెట్‌లో సందడి చేస్తున్న నయా కలెక్షన్‌ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.

గల్లీల్లో ఎగిరే పతంగులకు తోడు ప్రతి ఏటా జరిగే కైట్‌ ఫెస్టివల్‌ సిటీవాసులకు మరింత జోష్‌ను ఇవ్వనుంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మూడ్రోజుల పాటు జరిగే ఈవెంట్‌లో దేశవిదేశాలకు చెందిన పతంగుల విన్యాసాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి. ముచ్చటగొలిపే రంగుల పతంగులతో ఆకట్టుకునే విన్యాసాలతో కైట్ రైడర్స్ పిల్లలు, పెద్దలకు ఈ ఫెస్ట్‌ మరింత కిక్‌ను పంచనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories