భారతీయుల కోసం ఎల్.జీ మరో కొత్త ఫోన్ : ధర పర్లేదు-ఫీచర్స్ అదుర్స్

Submitted by admin on Tue, 09/04/2018 - 18:41

ఇండియన్ మార్కేట్ లో ఎన్ని కొత్త ఫోన్లు వచ్చిన,మరోక దానికి చోటు ఉంటుంది.అవి సక్సెస్ కావాలంటే ఎక్కువ ఫీచర్స్,తక్కువ ధరలో అందిచగలగటమే.ఇదే ప్రయత్నాం చేసింది దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఎల్.జీ.ఇప్పటి వరకు ఎన్నో ఫ్లాగ్‌షిప్ ఫీన్ల అందిచిన ఎల్.జీ తన  సరికొత్త స్మార్ట్ ఫోన్ 'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' పేరిట  సైలెంట్‌గా మార్కేట్ లో విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 6.2 అంగుళాల తెరతో 18:9 రేషియోలో అత్యంత నాణ్యమైన తెరను ఇది కలిగిఉంది.రెండు రకాల రంగుల్లో( మొరాకో బ్లూ, అరోరా బ్లాక్)  రేపటి నుంచి ఈ ఫోన్ అందరికి అందుబాటులో ఉంటుందని ఎల్.జీ తెలిపింది.మంచి ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ధరను 21 వేల రూపాయలుగా ఎల్.జీ నిర్ణయించింది.ఫోన్‌కు ఇచ్చిన ఫీచర్లతో పోల్చి చూసినప్పుడు ధర కాస్త పర్లేదు అని అనిపిస్తుంది.20 వేల పైన కాకుండా కొద్దిగా తగ్గించి ఉంటే బాగుండేది అని టెక్కీల మాట.

ఇక ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే  : 

  • 1080×2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 6.2" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 8.1  ఆండ్రాయిడ్  ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • వెనక  రెండు 16 మెగాపిక్సల్ కెమెరాలు
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • 3300 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 3డీ సరౌండ్ సిస్టం
English Title
lg new smart phone launch into market

MORE FROM AUTHOR

RELATED ARTICLES