కలిసి బతకనివ్వట్లేదు.. ఇక వచ్చే జన్మలోనే...

Submitted by arun on Tue, 06/12/2018 - 14:45
Lesbian

సమాజం తమను దూరంగా పెడుతుందని.. వెలేస్తుందనే భావనతో ఓ లెస్బియన్ జంట ఆత్మహత్య చేసుకుంది. ఓ మూడేళ్ల పాపతో పాటు వారిద్దరూ సబర్మతి నదిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..అహ్మదాబాద్‌.. బావ్లా పట్టణానికి చెందిన ఆశా(30) తన ఇద్దరు పిల్లలతో, అదే ప్రాంతంలో భావన(28) అనే మరో మహిళ తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. భర్తలు దూరం కావటంతో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ వీరిద్దరూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. గత ఏడు నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ... త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే కుల పెద్దలు మాత్రం వీరి సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో భావన, ఆశా తన కూతురు మేఘాను తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఊరి నుంచి వెళ్లిపోయారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ అనూహ్యాంగా నదిలో శవాలై కొట్టుకొచ్చారు. ఘటనాస్థలిలో పోలీసులు సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేమిద్దరం కలిసి జీవించాలనుకున్నాం. కానీ ఈ సమాజం అందుకు అనుమతించడం లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నాం. వచ్చే జన్మలోనైనా ఇద్దరం కలిసి బతకాలని కోరుకుంటున్నామని ఆశా, భావన పేర్కొన్నారు.

English Title
Lesbian couple commits suicide after throwing child in Sabarmati river

MORE FROM AUTHOR

RELATED ARTICLES