సూపర్ బామ్మ : 79 ఏళ్లుగా కరెంట్ లేకుండానే ఉంటుంది

సూపర్ బామ్మ : 79 ఏళ్లుగా కరెంట్ లేకుండానే ఉంటుంది
x
Highlights

అసలే ఎండాకాలం సరిగ్గా ఐదు నిముషాలు కరెంట్ లేకపోతే చుక్కలు కనిపిస్తాయి మనకి కానీ ఓ బామ్మ మాత్రం గత 79 సంవత్సరాల నుండి కరెంట్ లేకుంటనే ఉంటుందట....

అసలే ఎండాకాలం సరిగ్గా ఐదు నిముషాలు కరెంట్ లేకపోతే చుక్కలు కనిపిస్తాయి మనకి కానీ ఓ బామ్మ మాత్రం గత 79 సంవత్సరాల నుండి కరెంట్ లేకుంటనే ఉంటుందట. వినడానికి విచిత్రంగానే ఉంది కదా? కానీ ఇది నిజం .. ఈమె పేరు హేమా అసలు పేరు సావిత్రిబాయి పూలే ఈమెకు ప్రస్తుతం 79 సంవత్సరాలు.. పుణె యూనివర్శిటీ నుంచి బోటనీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది . ఆ తర్వాత కొన్నేళ్ల పాటు గర్వారే కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసింది.ఆమె ప్రస్తుతం ఓ పూరి గుడిసెలో ఉంటుంది. రాత్రి వేళల్లో లాంతరు మాత్రమే ఉపయోగిస్తుంది. పర్యావరణం అంటే ఆమెకు చాలా ఇష్టంమట. కరెంట్ లేకుండా ఎలా ఉంటున్నారు అని ఎవరైనా అడిగితే కరెంట్ లేనప్పుడు అందరు ఎలా ఉన్నారు ? అసలు మీరు కరెంట్ తో ఎలా జీవిస్తున్నారు అని ఎదురు ప్రశ్న వేస్తుందట. కరెంట్ లేకుండానే రాత్రిపూట చిమ్నీలు పెట్టుకుని పీహెచ్‌డీ దాకా చదివానని ఈ బామ్మ చెబుతుంది .

లైఫ్ ఇప్పుడు చాలా మెకానికల్ అయిపోయిందని ఫోన్లు, ఫ్యాన్లు లేకుంటే నిమిషం గడవడం కష్టంగా ఉన్న పరిస్థితి కానీ నాకు ఆలా కాదని నాకు ఈ పక్షులే నా స్నేహితులు ఇవే ప్రపంచమని ఆమె చెబుతుంది .ఈ పూరింట్లో ఉండటమే నాకు ఇష్టమని నన్ను చూసినవారు ఆమె చెత్తలో బతుకుతుంది అని అనుకుంటారు. అందుకే నేను ఎవరింటికీ వెళ్లడానికి ఇష్టపడనని ఈ 79 ఏళ్ల బామ్మ చెప్పుకొస్తుంది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఆమె పుస్తకాలు కూడా రాస్తారట, ఇప్పటికే బోటనీ, పర్యావరణంపై ఎన్నో పుస్తకాలు రాశారట . అవి ఇప్పటికి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని చెబుతుంది . ఎన్నో సభలో సమావేశాల్లో ఆమె ప్రసంగాలు కూడా ఇచ్చారట . ఎంతైనా బామ్మ ఇంత వయసు వచ్చిన కూడా ఇలా ఉండడం గ్రేట్ కదా.. !!


Show Full Article
Print Article
Next Story
More Stories