ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి...మలయాళ నటులపై కేరళ మంత్రి ఆగ్రహం

Submitted by arun on Tue, 09/04/2018 - 11:41
Kerala floods

కేరళకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన ప్రభాస్‌‌పై కేరళ టూరిజం మంత్రి సురేంద్రన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలని మలయాళ నటులపై మండిపడ్డారు. కేరళ బాధితుల సంరక్షణ నిమిత్తం ‘కేర్‌ కేరళ’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా సురేంద్రన్‌ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో ఎందరో సూపర్‌స్టార్లు ఉన్నారు. ప్రతీ సినిమాకు రూ.4 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని విన్నాను. వారంతా ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. ఆయన మలయాళ సినిమాల్లో నటించింది లేదు. అయినప్పటికీ కేరళ బాధితుల కష్టాలు చూడలేక కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు. కేరళ వరదల గురించి తెలిసిన వెంటనే సాయం చేయడానికి ముందుకొచ్చారు.’ అని వ్యాఖ్యానించారు సురేంద్రన్‌.

English Title
Learn from Prabhas, Kerala minister slams Malayalam superstars over flood relief donations

MORE FROM AUTHOR

RELATED ARTICLES