దేశమంతా ఏపీ వైపు చూసేలా సంస్కరణలకు సిద్ధంగా ఉన్నాం: జగన్

దేశమంతా ఏపీ వైపు చూసేలా సంస్కరణలకు సిద్ధంగా ఉన్నాం: జగన్
x
Highlights

హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తిని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. టెండర్ల...

హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తిని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. టెండర్ల ప్రక్రియను న్యాయవ్యస్థలో చేతిలో పెడతామని, దేశమంతా ఏపీ వైపు చూసేలా సంస్కరణలకు సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు. ఇందుకు అవసరమయ్యే అదనపు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సీఎం పదవి స్వీకరిస్తూ, మే 30న తాను ప్రకటించిన విధంగా టెండర్‌ విధానంలో సంస్కరణలు కోరుతూ ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ కలిశారు. సాయంత్రం 6 గంటలకు ఏసీజే ఇంటికి వెళ్లిన ఆయన దాదాపు గంట పాటు అక్కడ గడిపారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం, అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్యం శ్రీరాం, న్యాయవాది పొన్నవో లు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. అవినీతి రహితంగా పరిపాలిస్తానని పేర్కొన్న జగన్‌ మోహన్ రెడ్డి పారదర్శక టెండర్ల ప్రక్రియ కోసం జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలినాడే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన హైకోర్టు ఏసీజేని కలిశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories