సంచలనం రేపుతున్న టిక్కెట్ల అమ్మకం ఆడియో టేపులు

x
Highlights

టికెట్ల వ్యవహారంలో ఇప్పటికే తలబొప్పి కట్టించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో కొత్త తలనొప్పి మొదలైంది. టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ టీపీసీసీ నేతలు,...

టికెట్ల వ్యవహారంలో ఇప్పటికే తలబొప్పి కట్టించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో కొత్త తలనొప్పి మొదలైంది. టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ టీపీసీసీ నేతలు, స్కీనింగ్ కమిటీ ఛైర్మన్‌పై మాజీ మంత్రి బోడ జనార్థన్‌తో పాటు , రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ కోసం కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ తనను 3కోట్లు డిమాండ్‌ చేశారంటూ కాంక్యామ మల్లేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు అంజన్‌తో పాటు మరొక సన్నిహితుడిని భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ దగ్గరికి పంపితే 3 కోట్లు ఇస్తే సీటు కన్ఫామ్ చేస్తామని సాగర్ చెప్పినట్లు క్యామ మల్లేష్ కలకలం రేపారు. డబ్బు డిమాండ్ ‌కు సంబంధించిన టేపులను విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని క్యామ మల్లేశ్‌ ఆరోపించారు. అనేక చోట్ల బలహీన అభ్యర్థులను నిలిపారన్న మల్లేశ్ ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో దానం నాగేందర్‌ను గెలిపించేందుకే దాసోజు శ్రవణ్‌ను బరిలో దించారని ఆరోపించారు. మరోవైపు రాజేంద్ర నగర్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. మహాకూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ సీటును టీడీపీ తీసుకుని ఆ పార్టీ తెలంగాణ శాఖ ఎల్. రమణ ఆ టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. అంతేకాదు కార్తీక్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కార్తీక రెడ్డికి రాజేంద్ర నగర్ సీటు ఇవ్వకపోవడాన్ని నిరశిస్తూ ఆయన అనుచరులు శంషాబాద్ కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కార్తీక్ రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే యోచనలో ఉన్నారు. అలాగే టిక్కెట్లు రాని కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి కార్యచరణ రూపొందిస్తున్నాట్లు మాజీ మంత్రి బోడ జనార్థన్ చెప్సారు. 40 స్థానాలలో ఒకే గుర్తుపై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుతామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories