నేను హ్యాపీగా లేను.. వేదికపైనే ఏడ్చేసిన ముఖ్యమంత్రి..

నేను హ్యాపీగా లేను.. వేదికపైనే ఏడ్చేసిన ముఖ్యమంత్రి..
x
Highlights

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టారు జేడీఎస్ నేత కుమారస్వామి. మంత్రి పదవులు మొదలు.. ఆయనకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎవరికి...

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టారు జేడీఎస్ నేత కుమారస్వామి. మంత్రి పదవులు మొదలు.. ఆయనకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో కూడా కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో అయన అప్పట్లో మనస్థాపం చెందారు. ఆ తరువాత వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో మాజీ సీఎం సిద్దరామయ్య కుమారస్వామిని బాహాటంగానే విమర్శించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని సిద్దరామయ్యను కంట్రోల్ అయితే చేశారు. కానీ ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో పాలనలో ఇతరుల జోక్యం, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంతో కుమారస్వామి మనస్థాపం చెందారు. దానికి అయన భావోద్వేగానికి లోనయ్యారు. చెమర్చిన కళ్ళతో 'మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు. కానీ నేను సంతోషంగా లేను. నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా నేను ఉండలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను' అని కన్నీటి పర్యంతమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories