నేడు అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రసంగం

నేడు అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రసంగం
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఎలా ఒత్తిడి తేనున్నారో...

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఎలా ఒత్తిడి తేనున్నారో సభకు క్లారిటీ ఇవ్వనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్న సీఎం జగన్‌ రాష్ట్ర సమస్యలు, ప్రభుత్వ లక్ష్యాలపై ఫుల్‌ ప్లెడ్జెడ్‌ స్పీచ్ ఇవ్వనున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రసంగానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సమస్యలు, ప్రభుత్వ లక్ష్యాలపై ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్‌ టైమ్‌ ఫుల్ స్పీచ్ ఇవ్వనున్నారు. గవర్నర్‌ స్పీచ్‌‌కు ధన్యవాదాలు తెలుపనున్న సీఎం జగన్‌ ప్రత్యేక హోదాపై కీలక ప్రకటన చేయనున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో సభకు వివరించి ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేయనున్నారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం కేంద్రం ఎలా ఒత్తిడి తేనున్నారో సభకు వివరించనున్నారు.

ఇక 19న మరోసారి ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధాని ఆహ్వానం మేరకు అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక ముఖ్యమంత్రి హోదాలో ఈనెల 20న తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. నవ్యాంధ్ర జీవనాడి పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న జగన్‌ పనులను పరిశీలించి నిర్మాణం వేగవంతం చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్‌ టైమ్‌ పోలవరం పనులను పరిశీలించనున్న వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories