కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని

x
Highlights

తెలంగాణ ఎన్నికల బరిలో నందమూరి కుటుంబం తలపడటం ఖాయమైంది. నందమూరి వారసురాలు టీడీపీ అభ్యర్థిగా భాగ్యనగరం నుంచి పోటీ చేయబోతున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ...

తెలంగాణ ఎన్నికల బరిలో నందమూరి కుటుంబం తలపడటం ఖాయమైంది. నందమూరి వారసురాలు టీడీపీ అభ్యర్థిగా భాగ్యనగరం నుంచి పోటీ చేయబోతున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ టికెట్‌ను దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి పార్టీ కేటాయించింది. అటు తెలంగాణలో పోటీ చేస్తున్న 14 స్థానాలకు గానూ ఇప్పటికి 12 సీట్లను ప్రకటించిన టీడీపీ మరో ఇద్దరి పేర్లను ప్రకటించాల్సి ఉంది.

ఊహించినట్లే కూకట్‌పల్లి నియోజకవర్గ టికెట్‌ను దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీడీపీ కేటాయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కూకట్‌పల్లి బరిలో సుహాసిని ఉంటారని రెండ్రోజులుగా ప్రచారం జరుగుతున్నా..పార్టీ వర్గాలు ధృవీకరించలేదు. అయితే నిన్న సుహాసిని విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిశారు. కూకట్‌పల్లిలో పోటీ గురించి ఆమె చంద్రబాబుతో చర్చించారు. పోటీకి సుహానికి అంగీకరించడంతో ఆమెకే కూకట్‌పల్లి సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

వాస్తవానికి హరికృష్ణ కుమారుడు హీరో కళ్యాణ్‌రాంను కూకట్‌పల్లి నుంచి పోటీకి దింపాలని టీడీపీ మొదట భావించింది. ఆయన ఆసక్తి కనబర్చకపోవడంతో సుహాసినిని రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి నియోజవర్గంలో సెటిలర్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సెటిలర్లు ఏ పార్టీపై మొగ్గుచూపుతారో ఆపార్టీకి విజయావకాశాలు ఎక్కువ. పైగా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నారు. దీంతో సుహాసిని విజయం నల్లేరు మీద నడక అవుతుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

నిజానికి కూకట్‌పల్లి స్థానాన్నిమాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూకట్‌పల్లి కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ ఆశించారు. ఇద్దరూ ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. అయితే హరికృష్ణ మృతి తర్వాత ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరికి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని బాశించిన టీడీపీ అధిష్టానం సుహాసినికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. సుహాసినికి టిక్కెట్ ఇస్తున్నట్లు పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాస్‌తో చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌ కుటుంబానికి టికెట్‌ ఇస్తున్నందు వల్ల అంతా మద్దతు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఎన్టీఆర్ తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే రెండో అభ్యర్థి సుహాసిని కావడం విశేషం. ఆమె రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories