అర్జున్ రెడ్డి ఇంటికి కేటీఆర్

Submitted by arun on Mon, 06/25/2018 - 12:25
ktr

‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి గానూ మొదటి ఫిలింఫేర్‌ను అందుకున్న టాలీవుడ్ సెన్సేషనల్ నటుడు విజయ్ దేవరకొండ.. తన అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ విషయాన్ని కేటీఆర్‌కు తెలపగా సంతోషించిన మంత్రి, విజయ్‌ నిర్ణయాన్ని అభినందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆదివారం సాయంత్రం విజయ్ ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని విజయ్ తన సోషల్ మీడియాలో తెలుపుతూ 

‘మీ అభిమాన నాయకుడు మీ ఇంటికి భోజనానికి వస్తే ఎలా ఉంటుంది..  ఒక్క సెకను… అసలేం జరుగుతోంది బాసూ. బేసికల్ గా ఏమైనా జరగొచ్చు. మనం ప్రేమించే పని చేసుకుంటూ పోవాల్సిందే…నా ఫిలింఫేర్ అవార్డును కేటీఆర్‌కు చూపించాను.. వేలం గురించి మాట్లాడుకున్నాం.. నా అభిమానుల గురించీ చెప్పాను. చరిత్ర, చేనేత వస్త్రాలు, నీటి సంరక్షణ, హైదరాబాద్ లో రోడ్లను ఎందుకు తవ్వుతున్నారనేవాటిపై కేటీఆర్ మాకు అవగాహన కల్పించారు. ఆయన తండ్రి/బాస్, కొడుకు గురించి మాట్లాడుకున్నాం.. ప్లాస్టిక్ ను వాడకు విజయ్ అని అన్నారు.. ’ అని విజయ్ చెప్పాడే.

English Title
ktr visits vijay devarakonda house

MORE FROM AUTHOR

RELATED ARTICLES