ఐటీ మంత్రికి ట్విట్టర్‌లో పంచ్‌

x
Highlights

ఐటీ మంత్రికే ట్విట్టర్‌లో పంచ్‌ పడింది. ఓ సినిమా గురించి ట్వీట్‌ చేసినందుకు నెటిజన్లు కౌంటర్‌ ఇచ్చారు. రైతులు, విద్యార్థుల కష్టాలు పట్టించుకోకుండా...

ఐటీ మంత్రికే ట్విట్టర్‌లో పంచ్‌ పడింది. ఓ సినిమా గురించి ట్వీట్‌ చేసినందుకు నెటిజన్లు కౌంటర్‌ ఇచ్చారు. రైతులు, విద్యార్థుల కష్టాలు పట్టించుకోకుండా సినిమాలు చూడ్డమేంటని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. నెటిజన్ల ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చిన ఆ మంత్రి వెంటనే తన డీపీ మార్చేశారు. కేటీఆర్‌... తెలంగాణ ఐటీ శాఖా మంత్రి. ట్విట్టర్‌లో బాగా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడమేకాదు, అధికారులను అలర్ట్‌ చేస్తూ ట్వీట్స్‌ చేస్తుంటారు.

అసలే ఐటీ శాఖ మంత్రి. యంగ్‌ అండ్‌ ఎనర్జెటిక్‌... అలాంటి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఈ మధ్యే కేటీఆర్‌ ఫాలోయర్స్‌ లిస్టు వన్‌ మిలియన్‌ చేరుకుంది. ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు అప్పుడప్పుడూ తన అభిరుచులు, ఇష్టమైన వారితో తాను తీసుకున్న సెల్ఫీలు ట్వీట్‌ చేస్తుంటారు. అలాగే, తాజాగా రిలీజైన తొలిప్రేమ మూవీపై కూడా ట్వీట్‌ చేశారు. గ్రేట్‌ జాబ్‌ తమన్‌ అంటూ... మ్యూజిక్‌ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. తొలిప్రేమపై కేటీఆర్‌ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు... వెంటనే రియాక్ట్‌ అయ్యారు. రైతులు, విద్యార్థుల కష్టాలు పట్టించుకోకుండా సినిమాలు చూడ్డమేంటని ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

నెటిజన్ల సెడెన్‌ రియాక్షన్‌తో కేటీఆర్‌కు చిర్రెత్తికొచ్చింది. తనకూ ఇష్టాయిష్టాలుంటాయంటూ వారిపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. సినిమాలు చూడటం.. డీపీలు మార్చుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత జీవితం ఉండదా? అని ట్వీట్ చేశారు. ఇష్టమైతే ఉండండి.. లేకపోతే ట్విట్టర్‌లో తనను ఫాలో కావడం మానేయండని వాళ్లకు సూచించారు.
నెటిజన్లకు ఘాటు రిప్లే ఇచ్చిన కేటీఆర్‌ వెంటనే తన డీపీ కూడా మార్చేసుకున్నారు. అయితే, డీపీ మార్చిన తర్వాత కూడా కేటీఆర్‌పై నెటిజన్ల విమర్శలు ఆగలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories