పార్టీని అజేయ శక్తిగా మలుస్తా : కేటీఆర్

పార్టీని అజేయ శక్తిగా మలుస్తా : కేటీఆర్
x
Highlights

టీఆర్‌ఎస్‌ పార్టీని అజేయ శక్తిగా మారుస్తామన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన ఆయన మీ అందరి...

టీఆర్‌ఎస్‌ పార్టీని అజేయ శక్తిగా మారుస్తామన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన ఆయన మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం, శిక్షణ, సంస్థాగత నిర్మాణం కోసం కృషి చేయడంతో పాటు ప్రజలకు వందేళ్లు సేవ చేసేలా పార్టీ కార్యక్రమాలను తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా కృషి చేస్తాను. భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తా.. తనకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ వినమ్రంగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ.. శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories