ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్‌

ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్‌
x
Highlights

హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని ఓ వ్యక్తి బైక్‌ పై వెళ్తు హఠాత్తుగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. ఇది గమనించిన హోంగార్డులు చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా...

హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని ఓ వ్యక్తి బైక్‌ పై వెళ్తు హఠాత్తుగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. ఇది గమనించిన హోంగార్డులు చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు గుండెపోటుకు గురైన వ్యక్తి దగ్గరకు వెంటనే వచ్చి ఆ వ్యక్తి ఛాతిపై సీపీఆర్‌ (కార్డియోపల్మనరి రెససిటేషన్‌) పద్ధతి ద్వారా ఛాతీపై మసాజ్ చేసి.. ఊపిరి పీల్చుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత 108కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

మంత్రి కేటీఆర్‌ వారికి అభినందనలు తెలుపుతూ గురువారం ఉదయం ట్వీటర్‌లో ఓ సందేశం ఉంచారు. బహదూర్‌పుర పీఎస్‌లో పని చేసే హోంగార్డులు చందన్‌సింగ్‌, ఇనాయాతుల్లా ఖాన్‌లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. నగరంలో మరింత మంది కానిస్టేబుల​ సీపీఆర్‌ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి సమయాల్లో అది పనికొస్తుంది అంటూ కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ వీడియోను కూడా మంత్రి పోస్టు చేశారు. బహుదూర్‌పుర ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ శ్రీనివాస్‌, నగర ట్రాఫిక్‌ డీసీపీ రఘనాథ్‌ కూడా వారిపై ప్రశంసలు కురిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories