రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారు: కేటీఆర్

Submitted by arun on Thu, 08/16/2018 - 08:39

రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారంటు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు మంత్రి కేటిఆర్. కరీంనగర్ లో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్దాపన చేశారు. అవినితి, కాంగ్రేస్ పార్టీ రెండు అవిభక్త కవలలన్నారు. రాహుల్ పర్యటనలో ఆయన వెంటన ఉన్న నేతలు బెయిల్ పై జైలు నుంచి వచ్చిన వారేనన్నారు. 

కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ - వేములవాడ నాలుగు లైన్ల రోడ్ కి శంకు స్ధాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. తెలంగాణలో పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కౌటంర్ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. నాలుగేళ్ల పాటు ప్రజల ముఖం చూడని కాంగ్రెస్ నేతలు కొత్త బిచ్చగాళ్ల మాదిరి గ్రామాల్లోకి వస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణ అమరవీరులకు గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ ఆ చావులకు కారణం ఎవరో చెప్పాలంటూ నిలదీశారు.  

సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీని గెలిపించుకోలేని రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీని ఎలా గెలిపిస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల రిడిజైన్ విషయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తు డిసైన్ చేయడం కాంగ్రేస్ వారికి వచ్చినాక రి డిజైన్ అవరం ఏముంటుందంటు ఎద్దేవ చేశారు. రాహుల్ కామెంట్స్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. రాహుల్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సైతం కేటీఆర్ విమర్శనాస్త్రాలను సంధించారు.  

English Title
KTR Counters To Rahul Gandhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES