ఏపీలో మారనున్న రాజకీయ పరిణామాలు

ఏపీలో మారనున్న రాజకీయ పరిణామాలు
x
Highlights

సంక్రాంతి తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి, వలసలు ఊపందుకోనున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలోకి నేతలు క్యూ కడుతున్నారు....

సంక్రాంతి తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి, వలసలు ఊపందుకోనున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. ఇక విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో టీడీపీ టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అదే విశాఖకు చెందిన సీనియర్ నేత, బీజేపీ అధికార ప్రతినిధి రామకోటయ్య కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరితోపాటిగా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పురందేశ్వరి కూడా బీజేపీని వీడేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.

ఆమె తన భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కుమారుడు హితేష్ చెంచురామ్ తో కలిసి వైసీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కుమారుడు హితేష్ చెంచురామ్ కు పర్చూరు అసెంబ్లీ టికెట్ అలాగే తనకు ఎంపీ టికెట్ కావాలని జగన్ వద్ద పురందేశ్వరి ప్రస్తావించినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు కొణతాలతో వైసీపీ నేతలు టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories