పెళ్లి గురించి ఇంట్లో చర్చలు.. చెల్లి ఫోన్‌లో మాట్లాడుతుండటం చూసి..

పెళ్లి గురించి ఇంట్లో చర్చలు.. చెల్లి ఫోన్‌లో మాట్లాడుతుండటం చూసి..
x
Highlights

సెల్‌ఫోన్‌ తెచ్చిన చిచ్చు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అప్పటి వరకు కళ్లముందు తిరిగిన వారిని విగతజీవులుగా మార్చింది. క్షణికావేశంలో తీసుకున్న...

సెల్‌ఫోన్‌ తెచ్చిన చిచ్చు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అప్పటి వరకు కళ్లముందు తిరిగిన వారిని విగతజీవులుగా మార్చింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురిని తిరిగిరాని లోకాలకు పంపింది. అంతేకాక ఆ కుటుంబం పాలిట సెల్‌ఫోన్‌ శాపంగా మారింది. పెళ్లి ప్రస్తావనతో ఒక కుటుంబంలో చెలరేగిన ఘర్షణ ముగ్గురు తోబుట్టువులను బలిగొంది. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమళ్ల ఎక్స్‌రోడ్‌ గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన పలువురిని కలిచివేసింది.

రంగన్న, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకుమార్తె రాణెమ్మకు వివాహం చేశారు. హైదరాబాద్‌లో ఉండే పెద్ద కుమారుడు, కోడలు ఇటీవల పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. చిన్న కుమారుడు పెళ్లి విషయమై ఇంట్లో చర్చ జరుగుతుండగా చెల్లెలు జ్యోతి ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఫోన్‌లో మాట్లాడుతుండటంతో ఆగ్రహించిన అన్న మందలించి కొట్టాడు. తోబుట్టువుల మధ్య పరస్పర దూషణలు, అలకలకు దారితీసింది. ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది.

అన్న మందలించడంతో మనస్థాపం చెందిన జ్యోతి బావిలో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. చెల్లిని కాపాడుకునేందుకు ఇద్దరు అన్నలు బావిలో దూకేశారు. ఎవరికీ ఈత రాకపోవడంతో ముగ్గురూ నీటమునిగి మృతి చెందారు. తమ కళ్ల ముందే మునిగిపోతున్నా పిల్లలను కాపాడేందుకు తండ్రి రంగన్న ప్రయత్నించినా లాభం లేకపోయింది. బిడ్డలను కాపాడేందుకు యత్నించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గ్రామ యువకుల సహాయంతో జ్యోతి , రమేష్‌ , సంజీవ్‌ మృత దేహాలను వెలికితీశారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయ.

ముగ్గురు సంతానం ఒకేసారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డల మృతదేహాల వద్ద పడి రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరివల్లా కాలేదు సెల్‌ఫోన్‌ విషయంలో జరిగిన చిన్న గొడవ త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్న ఆ ఇంట అంతులేని విషాదాన్ని నింపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories