బస్సులో పైరసీ సినిమా.. మండిపడ్డ కేటీఆర్

Submitted by arun on Mon, 04/16/2018 - 12:39
ktr

టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాల ప్రదర్శనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సినిమాలు విడుదలైన మరుసటి రోజే ఓ కొత్త సినిమాను ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించినట్టు ఆయనకు ఫిర్యాదు అందింది. యువ హీరో నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం విడుదలైన మరుసటి రోజే గరుడ బస్సులో ప్రదర్శించినట్టు సునీల్ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనికి సంబందించిన స్క్రీన్ షాట్ కూడా తీసి ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కి పోస్ట్ చేస్తూ.. ‘‘ఒక ప్రభుత్వ బస్సులోనే ఇలా పైరసీ సినిమాలు వేస్తూ, సాధారణ ప్రజలకు మాత్రం పైరసీని నియంత్రించండంటూ చెప్పడం సమంజసమేనా’’? అని ప్రశ్నించాడు సదరు ప్రయాణికుడు.
 
దీంతో ఈ ఉదంతంపై వెంటనే స్పందిస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ విషయంలో ఆర్టీసీ సిబ్బంది చాలా భాద్యతారహితంగా వ్యవహరించారని మండిపడుతూ, ఆర్టీసీ బస్సుల్లో పైరసీ అనేది మరోసారి కన్పించకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ ఎండీని కోరారు కేటీఆర్. 

English Title
Krishnarjuna Yuddham Movie Piracy in TSRTC Minister KTR Fires

MORE FROM AUTHOR

RELATED ARTICLES