పార్లమెంటరీ మీటింగ్‌లో కేంద్రమంత్రికి అస్వస్థత

Submitted by arun on Wed, 12/20/2017 - 12:00
Krishna Raj, the Minister of State for Agriculture

భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరిగింది. అయితే సమావేశం మొదలైన కొద్ది సేపటికే కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కృష్ణరాజ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి కృష్ణరాజ్‌ కూడా హాజరయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. గత మూడు రోజులుగా జ్వరం రావడంతోపాటు ఆమెకు షుగర్‌ వ్యాధి కూడా ఉన్నందున ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు చెప్పారు.

English Title
Krishna Raj was rushed to the Ram Manohar Lohia hospital in New Delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES