క్రిష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్

క్రిష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్
x
Highlights

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కనున్న సినిమాపై సస్పెన్స్ వీడింది. ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ డైరెక్షన్ చేయనున్నట్టు...

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కనున్న సినిమాపై సస్పెన్స్ వీడింది. ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ డైరెక్షన్ చేయనున్నట్టు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా ప్రారంభించారు. కానీ తేజ ఈసినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో మూవీపై అనుమానాలు తలెత్తాయి. అయితే చివరకు ఎన్టీఆర్ మూవీని డైరెక్షన్ చేసే అవకాశం క్రిష్ కి దక్కింది. క్రిష్, బాలకృష్ణలది హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు పెరిగిపోనున్నాయి.

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ పై నెలకొన్న సందేహాలకు తెరపడింది. అసలు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆపేశారని వార్తలు వచ్చాయి. ఆ రూమర్లఅన్నింటికి తెరదించుతూ ఈ చిత్రం ఫై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాని గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకేక్కిన్చనున్నారు . స్వయంగా బాలకృష్ణే ఈ విషయాన్ని ప్రకటించారు.

బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ పాత్ర బాలయ్య పోషిస్తుండ‌గా, ఈ చిత్రంలో 64 పాత్రలలో బాల‌య్య క‌నిపించ‌నున్నాడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు బాల‌కృష్ణ కుమార్తెలు బ్రాహ్మణి, తేజ‌స్వి పేర్లు క‌లిసి వ‌చ్చేలా బ్రహ్మ తేజ ప్రొడ‌క్షన్ లో ఈ సినిమా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. వారాహి బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు

ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ ను తేజ దర్శకత్వంలో తెరకెక్కించాలని నిర్ణయించారు. ముహూర్తం షాట్ కూడా తీశారు. కానీ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి అందుకే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు దర్శకుడు తేజ తెలిపారు. ఆతర్వాత ఈ మూవీనీ ఎవరు పట్టాలకెక్కిస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను బాల‌య్యే ద‌ర్శక‌త్వం వ‌హిస్తార‌నే ప్రచారం కూడా జరిగినప్పటికి ప్రతిష్టాత్మక సినిమాలో ప్రయోగం చేసే ఉద్దేశంలేక ఇప్పటికే క్రిష్ తో హిట్టుకొట్టిన రికార్డు ఉండటంతో ఆయనకు అప్పగించారనే ప్రచారం జరుగుతోంది.

బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మిపుత్రశాత‌క‌ర్ణితో మంచి సక్సెస్ సాధించారు. తెలుగు ఖ్యాతిని చాటేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. అందుకే క్రిష్‌పై న‌మ్మకంతో ఎన్టీఆర్ బయోపిక్ మూవీని క్రిష్ కు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక త్వరలో మిగిలిన పాత్రల్లో ఎవరెవరు నటిస్తారనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories