నేడు బీజేపీలో చేరనున్న వైసీపీనేత

Submitted by nanireddy on Mon, 08/27/2018 - 11:40
kotla harichakrapanireddy join in bjp

ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత నేడు పురందేశ్వరి సమాక్షంలో బీజేపీలో చేరనున్నారు. కోట్ల ఫ్యామిలీకి చెందిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి. 2014 ఎన్నికల్లో పత్తికొండలో వైసీపీనుంచి డిప్యూటీ సీఎం కెఇ కృష్ణమూర్తి చేతిలో ఓటమి చెందారు. దాంతో అయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల రీత్యా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నారాయణరెడ్డి వైసీపీలో చేరిపోయారు. అయితే అయన పార్టీలో చేరిన కొద్దిరోజులకే ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. అనంతరం నారాయణ రెడ్డి భార్య కంగాటి శ్రీదేవిని పత్తికొండ ఇంఛార్జిగా నియమించారు జగన్. ఈ పరిణామం హరిచక్రపాణిరెడ్డికి రుచించలేదు. దీంతో అయన టీడీపీలో చేరాలని మొదట భావించారు కానీ అక్కడ  కెఇ ఫ్యామిలీ అడ్డుతగలడంతో బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.  

English Title
kotla harichakrapanireddy join in bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES