గడ్డం తీసేసి జీన్స్‌లోకి మారిన పవన్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

గడ్డం తీసేసి జీన్స్‌లోకి మారిన పవన్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
x
Highlights

టాలీవుడ్‌లో మాస్ ఇమేజ్‌తో పాటు సూపర్ స్టార్‌గా ఉన్న తరుణంలోనే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు పవన్‌ కళ్యాణ్. అయితే తిరిగి సినిమాలు చేయాలని...

టాలీవుడ్‌లో మాస్ ఇమేజ్‌తో పాటు సూపర్ స్టార్‌గా ఉన్న తరుణంలోనే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు పవన్‌ కళ్యాణ్. అయితే తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే, అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. ఇటివల ముగిసిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సోంతగా పార్టీ స్థాపించుకొని అసెంబ్లీ ఎన్నికల కధనరంగంలోకి దూకారు. అయితే చివరికి ఎన్నికల ఫలితాలు వచ్చేసారికి విఫలమయ్యాడు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికల ముందు, తరువాత కూడా గడ్డంతో, తెల్ల లాల్చీ, పంచెలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జీన్స్, టీ షర్ట్స్‌లోకి వచ్చేశారు. గడ్డాన్ని ట్రిమ్ చేశారు. గడ్డం తీసేసి మళ్లీ రెగ్యూలర్ లుక్‌లోకి మారిపోయిన పవన్ కళ్యాణ్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే అభిమానులు మాత్రం తిరిగి వెండితెరపై రీ ఎంట్రీకి పవన్ సిద్ధమయ్యాడని, త్వరలోనే సినిమాల్లో కనిపించడం పక్కా అని అంటున్నారు పవన్ అభిమానులు. అయితే ఇటివలే పవన్ తాను మళ్లీ తిరిగి సినిమాల్లో నటించే ఆలోచనే లేదని క్లారీటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడ్డం తీసేయడంతో అభిమానులు మాత్రం మళ్లీ వెండితెరపై వస్తాడని తెగ సంబురపడుతున్నారు. విషయంలో పవన్ ఇంకా తన మనసులోని మాటను వెల్లడించక పోవడం గమనార్హం. గడ్డం తీసేసి జీన్స్ లోకి మారిపోయిన పవన్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories