రాజ‌మౌళికి పోటీగా కొర‌టాల శివ‌

రాజ‌మౌళికి పోటీగా కొర‌టాల శివ‌
x
Highlights

కొరటాల శివ కూడా త్రివిక్రమ్ లానే సింగిల్ ఎజెండాతో పనిచేస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనుకునే ,తను, ఇప్పుడా పనిలోనే ఉన్నాడు రాజమౌలికే...

కొరటాల శివ కూడా త్రివిక్రమ్ లానే సింగిల్ ఎజెండాతో పనిచేస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనుకునే ,తను, ఇప్పుడా పనిలోనే ఉన్నాడు రాజమౌలికే పోటీగా తయారయ్యేలా ఉన్నాడు. వందల కోట్ల వసూళ్ల కి కేరాఫ్ అడ్రస్ అయిన, తనకు, ఒకే ఒక మిషన్ తో ముందుకుపోతున్నాడు. కాకపోతే, అదే జరిగే పనేనా అనే అనుమానాలు పెరిగాయ్ ఓ స్థాయి మూవీల వరకు ఓకే కాని, రాజమౌళిలా నెక్ట్స్ లెవల్ కి వెళ్లే సత్తా ఉందా అనే ప్రశ్నలే వస్తున్నాయ్.

కొరటాల శివ కూడా, రాజమౌళి, త్రివిక్రమ్ లా సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ అనిపించుకున్న దర్శకుడు. త్రవిక్రమ్ కైనా అగ్నాత వాసి పంచ్ పడింది కాని, ఇప్పడి వరకు కొరటాల ప్రతీ మూవీ హిట్టైంది. ప్రతీ మూవీ వందకోట్ల కు పైనే రాబట్టింది. కేవలం తెలుగులో నే వందకోట్లు రాబట్టగలిగిన సినిమాలతో తనకంటూ హిస్టరీ క్రియేట్ అయ్యింది. లాస్ట్ మూవీ జనతాగ్యారేజ్ కి 135 కోట్ల వసూల్లొచ్చాయి.

రాజమౌళికి పోటీ ఇవ్వాలి కుదరితే తన ప్లేస్ లో లేదంటే, తనకి పోటీ ఇచ్చే స్థానం లోకూర్చోవాలి ఇదే అటు త్రవిక్రమ్, ఇటు కొరటాల సింగిల్ పాయింట్ ఎజెండా కనీసం త్రివిక్రమ్ అయిన చిన్న చితకా సినిమాలుతీశాడు..కాని కొరటాల శివ మాత్రం మొదట్నుంచే భారీ ప్రాజెక్టులు చేస్తూ, మూడు హిట్లతోనే టాప్ డైరెక్టర్ గా మారాడు.

స్క్రిప్ట్ రైటింగ్ నుంచి డైరెక్టర్ గా మారినప్పుడే, కొరటాల శివ, టాప్ డైరెక్టర్ అవ్వాలనే మిషన్ తోనే ప్రాజెక్ట్లు చేశాడు లోబడ్జెట్ మూవీలు, చిన్నా చితకా హీరోలతో సినిమాలు అసలు ప్లానే చేయలేదు పెద్ద హీరోలు తప్ప మరో స్టార్ తో తను సినిమా తీయలేదు.

అసలు రాజమౌళికి కొరటాల శివ పోటీ ఇస్తాడనే లెక్క శ్రీమంతుడితోనే మొదలైంది బాహబులి దీ బిగినింగ్ వచ్చి వసూళ్ల సునామీ క్రియేట్ చేసినప్పుడు, శ్రీమంతుడు కొట్టుకుపోతందన్నారు..కాని, బాహబులి వచ్చిన నెలకొచ్చిన శ్రీమంతుడు మూవీ దుమ్ముదులిపింది. 160 నుంచి 200 కోట్ల షేర్ రాబట్టి, హిస్టరీ క్రియేట్ చేసింది...అందుకే రాజమౌళికి, కొరటాల పోటీ

అసులు మిర్చీ మూవీతోనే కొరటాల టార్గెట్ రాజమౌలే అనే మాటలు వినిపించాయి. డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే ప్రబాస్ తో భారీ మూవీ తీశాడు..మాస్ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. అలా మిర్చీ నుంచి జనతా గ్యారేజ్ వరకు వరుసగా హిట్లు ప్రభాస్ తర్వాత మహేశ్, ఆతర్వాత ఎన్టీఆర్...ఇప్పుడు తిరిగి మహేశ్ బాబుతోనే భరత్ అను నేను తీస్తున్నాడు అందుకే రాజమౌలికి, పోటీ ఇచ్చే స్టామినా తనకుందని అనంటున్నారు

రాజమౌళి చిన్న హీరోలు, కమేడీయిన్లతో సినిమాలు తీసి బాక్సాఫీస్ షేక్ చేశాడు..మర్యాదరామన్నాలో సునిల్, ఈగలో నాని, ఇలా వీళ్లతో సినిమాతు తీసి కూడా బ్లాక్ బస్టర్స్ హిట్లు సొంతం చేసుకున్నాడు. రాజమౌళి స్టాంప్ ఉంటే చాలు జనం థియేటర్స్ కిపరగులు తీస్తారనిపించుకున్నాడు అయితే కొరటాల మాత్రం ఆవిషయంలో వెనుకబడ్డాడడు. ఇంతవరకు చిన్న హీరోలతో సినిమా తీయలేదు...అఖిల్ తో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు కాబట్టి, అది కూడా హిట్టైతే, రాజమౌళికి కొరటాలే పోటీ అనే పరిస్థితి రావొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories