కాంగ్రెస్ లో కొండాకు కీలక పదవి..?

Submitted by arun on Wed, 09/26/2018 - 17:33

కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొండా మురళి, సురేఖ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు స్థానాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. 

వరంగల్‌ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా దంపతులు పార్టీలో చేరారు.  కొండా సురేఖకు సీటు ఖాయమని పార్టీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదు స్థానాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నెలకొంది.

ఈ సందర్భంగా కొండా సురేఖ.. కాంగ్రెస్ పార్టీ త​మ సొంతిల్లు లాంటిదని చెప్పారు. తాను బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరానని, తమ కుటుంబానికి రెండు, మూడు సీట్లు అడుగుతున్నానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేస్తానన తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమలాంటి సమర్ధ నాయకులు టీఆర్ఎస్‌లో ఉంటే ప్రశ్నిస్తారనే భయంతోనే టీఆర్ఎస్ తమను పక్కన పెట్టిందన్నారు.

కొండా సురేఖ దంపతులు మళ్లీ ఘర్ వాపసీ అయ్యారన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.  కాంగ్రెస్ ప్రచార కమిటీలో కొండా సురేఖకు స్థానం కల్పిస్తామని, రాష్ట్రమంతా తిరిగి ఆమె పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు. కొండా దంపతుల చేరికతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయిందని చెప్పారు. కొండా సురేఖ సమర్ధులైన బీసీ నాయకురాలని, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె ప్రభావం ఉంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారని చెప్పారు.  
 

English Title
konda surekha joins congress party

MORE FROM AUTHOR

RELATED ARTICLES