ఆ సీటు ఇస్తేనే వస్తామని చెప్పాం: కొండా సురేఖ

Submitted by arun on Sat, 09/08/2018 - 12:14
konda

టీఆర్ఎస్‌ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ ప్రకటించిన జంబో లిస్ట్‌లో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందన్నారు. బీసీ మహిళననే నా పేరు ప్రకటించకుండా అవమానించారని ఆరోపించారు. మేం చేసిన తప్పేంటో తెలియజేయాలన్నారు. కార్పొరేషన్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా డబ్బులు ఖర్చు చేసి గెలిపించామని వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గత ఎన్నికల సమయంలో చాలాసార్లు తమకు వర్తమానం పంపారని...అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్‌ఎస్‌లోకి వస్తామని తాము తెల్చిచెప్పామని అన్నారు. అందుకు కేసీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని ఆమె గుర్తుచేశారు. వరంగల్‌ తూర్పు నుంచి భారీ మెజార్టీతో గెలిచానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

English Title
Konda Surekha fire on KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES