ఎమ్మెల్యే పదవికి ఇవాళే రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

Submitted by arun on Tue, 03/13/2018 - 12:37
Komatireddy Venkat Reddy

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకే శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన అనుచరుడైన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను చంపారనీ ఇప్పుడు తనను కూడా చంపుతారని అనుమానం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు 150 మందిని హత్య చేసిన వేముల వీరేశాన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ఇవాళే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానన్న కోమటిరెడ్డి స్పీకర్ దగ్గర కూర్చొని రాజీనామా ఆమోదింపచేసుకుంటానని చెప్పారు. రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. ప్రతి రోజూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ముఖం చూడటం ఇస్టం లేక  పదిరోజుల కిందటే రాజీనామా చేద్దామనుకున్నానని కోమటిరెడ్డి వివరించారు. 

English Title
Komatireddy Venkat Reddy Sensational Comments on CM KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES