నన్ను ఎమ్మెల్యేగా గుర్తించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు: కోమటిరెడ్డి

Submitted by arun on Wed, 05/23/2018 - 14:25
kcr

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కోమటిరెడ్డికి సీఎం లేఖ పంపారు. ‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’. అని లేఖలో పేర్కొన్నారు. లేఖపై స్పందించిన కోమటిరెడ్డి వెంటకట్‌రెడ్డి తనకు శభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి పలు అంశాలను లేవనెత్తారు. తనను ఎమ్యెల్యేగా గుర్తించిన సీఎం.. మరి మిగితా ప్రోటోకాల్ అంశాలను ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. భద్రత, ఇతర సౌకార్యాలు కల్పించడంలో సీఎం ఎందుకు పట్టించుకోలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నలు కురిపించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌పై దాడి చేశారంటూ కోమటరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా తీర్పు వెలువడింది. వారి శాశసభ సభ్యత్వాలను పునరుద్ధరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

English Title
komatireddy venkat reddy responds kcr wishes

MORE FROM AUTHOR

RELATED ARTICLES