అక్కడి నుంచే తెలంగాణకు రెండో సీఎం

Submitted by arun on Mon, 07/16/2018 - 17:18
rajagopal reddy

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేసిన సోనియా రుణాన్ని తీర్చుకునే సమయం వచ్చిందని, కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ తగాదాలు ఉంటే కేసీఆర్ బలపడతారని, అందరం ఒక్కటైతే, కేసీఆర్ పరార్ అవడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి కావచ్చు. టీఆర్ఎస్‌లో మాత్రం అయితే కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే సీఎం అవుతారు. కానీ కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం కష్టపడ్డ వారికి తగిన ఫలితం ఉంటుంది.

కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా నన్ను కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్సీగా గెలిపించి సత్తా చాటారు. తెలంగాణ ప్రజలంతా నల్గొండ జిల్లా నాయకత్వం వైపు చూస్తున్నారు. పార్టీ నాయకులు అందరూ సమన్వయంగా కలిసికట్టుగా ముందుకెళ్తే 2019లో గెలుపు కాంగ్రెస్‌దే. ఇక్కడ వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, భువనగిరిలో ఎలాంటి వర్గ విభేదాలు లేవు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే మన లక్ష్యమని’ ఆయన వివరించారు.
 

English Title
komatireddy rajagopal reddy fire on cm kcr

MORE FROM AUTHOR

RELATED ARTICLES