ఆసీస్ ను కట్టడి చేశారు..

ఆసీస్ ను కట్టడి చేశారు..
x
Highlights

దూకుడుగా పరుగులు తీస్తున్న ఆసీస్ ను ఇన్నింగ్స్ చివరికి వచ్చేటప్పటికి పాకిస్థాన్ బౌలర్లు కట్టడి చేయగలిగారు. భారీ స్కోరు దిశగా పయనిస్తున్న ఆస్ట్రేలియా...

దూకుడుగా పరుగులు తీస్తున్న ఆసీస్ ను ఇన్నింగ్స్ చివరికి వచ్చేటప్పటికి పాకిస్థాన్ బౌలర్లు కట్టడి చేయగలిగారు. భారీ స్కోరు దిశగా పయనిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లను చివర్లో నిలువరించగలిగారు. అయితే, అప్పటికే ఆలస్యం అయిపొయింది. పాకిస్థాన్ ను ఇబ్బంది పెట్టగలిగే స్కోరును ఆసీస్ చేసేసింది. మొదట్లో ఆ జట్టు దూకుడు చూస్తే.. కచ్చితంగా 350 పరుగులు దాతెస్తుందనిపించింది. అయితే, సెంచరీ చేసిన వార్నర్ 38ఓవర్ లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఇమామ్‌ చేతికి నాలుగో వికెట్ గా చిక్కడంతో ఆసీస్ కు కళ్ళెం పడింది. అక్కడ నుంచి పాకిస్తాన్ పట్టు బిగిస్తూ వచ్చింది. మరోపక్క ఆసీస్ బ్యాట్స్ మెన్ భారీ స్కోరు దృష్టితో బ్యాట్ జులిపించే ప్రయత్నం చేయడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 38 ఓవర్ల వరకూ నాలుగు వికెట్లే కోల్పోయిన ఆసీస్ తరువాత పది ఓవర్లలోనే.. మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. అదే సందర్భంలో పరుగుల వేగమూ మందగించింది. ఖవాజా(18), షాన్‌మార్ష్‌ (23), కౌల్టర్‌నైల్‌ (2), కమిన్స్‌ (2), కారె (20) ఇలా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఊహించినంత స్కోరు సాధించలేకపోయింది. పాకిస్తాన్ బౌలర్లలో అమీర్ ఐదు వికెట్లు తీశాడు. చివరికి 49 ఓవర్లకే 307 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయారు కంగారూలు. పాకిస్తాన్ విజయలక్ష్యం 308.

ఆస్ట్రేలియా బ్యాటింగ్..



















పాకిస్థాన్ బౌలింగ్..







Show Full Article
Print Article
More On
Next Story
More Stories