కేరళ వరద బాధితులకు చిన్నారితల్లి భారీ విరాళం..

కేరళ వరద బాధితులకు చిన్నారితల్లి భారీ విరాళం..
x
Highlights

రెండు వారలపాటు కేరళను వరదలు హోరెత్తించాయి . వరదల దాటికి పేద, ధనిక వర్గాలు అన్న బేధాలు లేకుండా అందరూ బాధితులయ్యారు. భారీ వరదలతో వందలమంది ప్రాణాలు...

రెండు వారలపాటు కేరళను వరదలు హోరెత్తించాయి . వరదల దాటికి పేద, ధనిక వర్గాలు అన్న బేధాలు లేకుండా అందరూ బాధితులయ్యారు. భారీ వరదలతో వందలమంది ప్రాణాలు కోల్పోగా వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇక నీటిలో మునిగిన ఇళ్ళకైతే లెక్కేలేదు.. ఈ క్రమంలో కేరళ వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా ముందుకు వస్తున్నారు. ఆలా తనవంతు సాయం అందించటానికి నాలుగేళ్ల చిన్నారి ముందుకు వచ్చింది. కొంతకాలంగా తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ. 14 వేల 8 వందల రూపాయలను విరాళంగా ఇచ్చేసింది. కోల్ కత్తా కు చెందిన అపరాజిత రోజూ కార్టూన్ ఛానెల్ చూసేది. అయితే ఇటీవల న్యూస్ ఛానల్ చూసి ఆశ్చర్య పోయింది. టీవిలో ఏమి జరుగుతుందమ్మా అని వాళ్ళమ్మను అడిగింది. దానికి పాప తల్లి నీలాంటి ఎంతో మంది చిన్నారులు నీటిలో చిక్కుకుని బాధపడుతున్నారని, ఆకలితో ఏడుస్తున్నారంటూ వివరించింది. దీంతో వెంటనే తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును తల్లిదండ్రులకు ఇచ్చి తన అక్కా చెల్లెళ్లకు వినియోగించాలని సూచించింది. దాంతో సంతోషించిన చిన్నారి తల్లిదండ్రులు జవదేవపూర్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీమన్‌ బోస్‌.. కేరళ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్‌ క్యాంపునకు అపరాజితను తీసుకువెళ్లగా.. ఆమె తన పిగ్గీ బ్యాంకును ఆయనకు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories