వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తా: లోకేష్

వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తా: లోకేష్
x
Highlights

వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్న ఆయన తాను ...

వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్న ఆయన తాను మంగళగిరి నుంచి పోటీ చేయడమే అదృష్టంగా భావిస్తానన్నారు. మంగళగిరి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళిక‌లు సిద్ధం చేశామన్నారు. ఓడిపోయినా ప్రణాళికల అమలుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని మీ అభిమానం కంటే విజ‌య‌ం మరోటి ఉండదని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి బరిలో నిలిచిన లోకేష్‌ వైఎస్సార్ సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో ఘోర పరాజయం పాలైన తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories