యాంకర్ పై అసహనం వ్యక్తం చేసిన మహేష్ బాబు

యాంకర్ పై అసహనం వ్యక్తం చేసిన మహేష్ బాబు
x
Highlights

సాధారణం గా ఒక పెద్ద సినిమా విడుదల అవుతుంది అంటే హీరోలు ఒక వారం ముందు నుండే ఫుల్ గా ప్రమోషన్స్ తో బిజీ గా గడుపుతూ ఉంటారు. ఇదే విధం గా ఇప్పుడు మహర్షి...

సాధారణం గా ఒక పెద్ద సినిమా విడుదల అవుతుంది అంటే హీరోలు ఒక వారం ముందు నుండే ఫుల్ గా ప్రమోషన్స్ తో బిజీ గా గడుపుతూ ఉంటారు. ఇదే విధం గా ఇప్పుడు మహర్షి విడుదల సంఙదర్భం గా మహేష్ బాబు కూడా ఫుల్ బిజీ గా ప్రచార బాధ్యతల్లో మునిగి తేలుతున్నాడు. ఈ సినిమా రేపు విడుదల కానుండటం తో టీవీ, వెబ్ మరియు ప్రింట్ మాధ్యమాల కి ఇంటర్వూస్ ఇస్తూ బిజీ గా ఉన్నాడు మహేష్.

అయితే తాజా సమాచారం మేరకు ఈ ప్రమోషన్స్ లో భాగం గా ఒక కార్యక్రమం లో యాంకర్ మహేష్ పోషించిన రైతు పాత్ర గురించి చెప్తూ, ఆ ఫొటోల్లో మహేష్ కాళ్ళు, పాదాల పైన కామెంట్స్ చేసింది. అలాంటి కామెంట్స్ సాధారణం గా ఒక హీరోయిన్ పై ఎవరైనా చేసి ఉంటె, ఇప్పటికి అది పెద్ద కాంట్రవర్సయి అయ్యేది కానీ మహేష్ తన టెంపర్ ని కంట్రోల్ చేసుకొని డీసెంట్ గా సమాధానం ఇచ్చి ఇంటర్వ్యూ పూర్తి చేసాడు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇంటర్వ్యూ పూర్తి అయ్యాక మహేష్ తన టీమ్ దగ్గర అసహనం వ్యక్తం చేసాడట. అలాంటి ప్రశ్న అడిగిన యాంకర్ పై మండిపడ్డాడట. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కాకుండదు అని స్ట్రిక్ట్ గా వార్ణింగ్ ఇచ్చి పంపేసాడట.

Show Full Article
Print Article
Next Story
More Stories