ఇది మరి విడ్డూరం: దేవుళ్ళకు ఫ్యాన్లు, కూలర్లు

ఇది మరి విడ్డూరం: దేవుళ్ళకు ఫ్యాన్లు, కూలర్లు
x
Highlights

ఎండలు దంచి కొడుతున్నాయి . ఉదయం తొమ్మిది కాగానే సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బయటికి వెళ్ళాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి . ఇంట్లోనే ఫాన్స్...

ఎండలు దంచి కొడుతున్నాయి . ఉదయం తొమ్మిది కాగానే సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బయటికి వెళ్ళాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి . ఇంట్లోనే ఫాన్స్ ,కూలర్లు ,ఏసి వేసుకొని ఉంటె పోలే అని అనుకుంటునారు . మరి ఈ తిప్పలు కేవలం మనుషలకేనా? మనిషిని రక్షంచే దేవుడికి ఉండదా ఏంటి ? దేవుళ్ళకు ఫ్యాన్లు కూలర్లు అవసరం లేదా ? అని కొందరు అలోచించి ఉంటారు కావచ్చు . అందుకే గర్భగుడిలో కూలర్లు, ఏసీలు పెట్టేస్తున్నారు.

ఈ సంఘటన కాన్పూర్‌లో జరిగింది . అక్కడి సిద్ధి వినాయక్ గణేష్ ఆలయంలోని గర్భగుడిలో కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. గణనాధుడి ఆలయమే కాదు.. మరికొన్ని గుడుల్లో కూడా ఈ ఏసీలు, కూలర్లు పెట్టేశారు. కొన్ని ఆలయాల్లో ఏసీ, కూలర్లు బదులు ఫ్యాన్లతో సరిపెట్టేస్తున్నారు. ఆలయాల్లోని గర్భగుడిలో ఏసీలు, కూలర్లు చూసి.. ఇదేంటని భక్తులు ఆలయంలో పూజర్ల దగ్గర ఆరా తీయడం మొదలు పెట్టారట ..

భక్తులు మాత్రమేనా.. ఆ దేవుళ్లకు కూలర్లు, ఫ్యాన్లతో వేసవి తాపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఆలయ పూజారులు. దేవుడికి కూడా ఎండ వేడి తగులుతుంది.. వాళ్లు కూడా మనుషుల లాంటి వారేనంటున్నారు. అందుకే కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేశామంటున్నారు.విన్నవాళ్ళు ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారు .



Show Full Article
Print Article
Next Story
More Stories