ట్రంప్‌తో భేటికి టాయ్‌లెట్‌ వెంట తెచ్చుకున్న కిమ్‌

ట్రంప్‌తో భేటికి టాయ్‌లెట్‌ వెంట తెచ్చుకున్న కిమ్‌
x
Highlights

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌...దేశాధినేతల్లో విలక్షణమైన వ్యక్తి. విచిత్రమైన పనులు చేస్తూ....వార్తల్లోకి ఎక్కుతుంటారు. అమెరికా అధ్యక్షుడు...

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌...దేశాధినేతల్లో విలక్షణమైన వ్యక్తి. విచిత్రమైన పనులు చేస్తూ....వార్తల్లోకి ఎక్కుతుంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీకి సింగపూర్‌‌కు వెళ్లారు. అధికారులు, భద్రతా సిబ్బందితో పాటు తన వ్యక్తిగత సహాయకులను వెంట తీసుకెళ్లారు. అక్కడి ఆగని కిమ్‌....ఓ విచిత్ర పని చేసి తాజాగా వార్తల్లో నిలిచారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌....దేశానికి సంబంధించిన ఏ పని చేసినా రహస్యంగా చేస్తారు. అణుపరీక్షలు నిర్వహించడంలో, శత్రువులను హెచ్చరించడంలో వినూత్నంగా వ్యవహరిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో శిఖరాగ్ర చర్యలకు సింగపూర్ వెళ్లారు కిమ్ జంగ్. తన బలహీనతలు ప్రత్యర్థులు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. స్థూలకాయుడైన కిమ్‌కు స్వతహాగా ఫాటీ లీవర్‌ ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.

ప్రత్యర్థులు ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటారన్న భయంతో కిమ్‌....నార్త్ కొరియా నుంచే మొబైలట్‌ టాయ్‌లెట్‌ను వెంట తెచ్చుకున్నారు. తన మల, మూత్రాలను పరీక్షించి..శత్రుదేశాలు ఆరోగ్య సమస్యను అంచనా వేస్తారన్న అనుమానంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్‌ చేయగల అత్యాధునికమైన టాయ్‌లెట్‌ను తెచ్చుకున్నట్లు దక్షిణ కొరియా పత్రిక కథనాన్ని ప్రచురించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories