న‌వంబ‌ర్ 17న 'ఖాకీ'

న‌వంబ‌ర్ 17న ఖాకీ
x
Highlights

'యుగానికి ఒక్క‌డు', 'ఆవారా', 'నాపేరు శివ' చిత్రాల‌తో తెలుగు వారికి చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు కార్తీ. తెలుగులో రూపొందిన స్ట్ర‌యిట్ చిత్రం 'ఊపిరి'తో...

'యుగానికి ఒక్క‌డు', 'ఆవారా', 'నాపేరు శివ' చిత్రాల‌తో తెలుగు వారికి చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు కార్తీ. తెలుగులో రూపొందిన స్ట్ర‌యిట్ చిత్రం 'ఊపిరి'తో ఇక్క‌డివారికి మ‌రింత చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం 'ధీర‌న్ అధిగారం ఒండ్రు' అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తున్నాడు కార్తీ. తెలుగులో ఈ చిత్రాన్ని 'ఖాకీ' పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని తొలుత దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. న‌వంబ‌ర్ 17కి ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా టీజ‌ర్ ని సెప్టెంబ‌ర్ 27న‌, ట్రైల‌ర్‌ని అక్టోబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఆడియో సంస్థ 'ఆదిత్యా మ్యూజిక్' అధినేత ఉమేష్ గుప్తా విడుద‌ల చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories