పురందేశ్వరి, కన్నా ఇద్దరు రాష్ట్ర ద్రోహులు

Submitted by arun on Wed, 08/15/2018 - 16:56
tdp

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. బుధవారం ఉదయం కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ మండిపడ్డారు. కాగా.. ఆయన వ్యాఖ్యలను ఆయనకే తిప్పి కొట్టారు ఎంపీ కేశినేని నాని. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్ర ద్రోహి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. నగరంలోని తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నా రాష్ట్ర ద్రోహి అని, బీజేపీలో చేరి రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి అని విమర్శించారు. పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా తయారయ్యారని మండిపడ్డారు. బీజేపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అమరావతి బాండ్స్ గంటలో వేగంగా అమ్ముడు అయ్యాడంటే చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధితో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.
 

English Title
kesinani-nani-fire-bjp-leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES