మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు

Submitted by arun on Tue, 01/30/2018 - 18:11
man falls

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు....మచ్చుకైన లేడు చూడు...మానవత్వం ఉన్నవాడు...అని అందెశ్రీ ఎప్పుడో పాట రాసేశారు. అచ్చంగా కేరళో ఇలాంటి ఘటనే జరిగింది. కేరళలో నాలుగంతస్థుల భవనం మీద నుంచి ఓ వ్యక్తి...ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయాడు. వాహనదారులు, పాదాచారులు చూస్తుండగానే కిందపడిపోయాడు. రోడ్డు మీద ఉన్న వారికి కాసేపు ఎలా పడ్డాడో అర్థం కాలేదు.

పక్కనున్న భవనంపై నుంచి కిందికి పడ్డాడని గ్రహించిన పాదాచారులు, వాహనదారులు సదరు వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తర్వాత కొంతమంది పాదాచారులు అంబులెన్స్‌కు ఫోన్‌ చేయడంతో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. 

English Title
Kerala man falls from 4th floor

MORE FROM AUTHOR

RELATED ARTICLES