వరద నీటితో ఇళ్లంతా నిండిపోయింది..దయచేసి నన్ను కాపాడండి...

Submitted by arun on Sat, 08/18/2018 - 11:02

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ కకావికలమైంది. ఇప్పటికే 4వందల మందికి పైగా మృతి చెందారు. 3లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న వారిలో ఇప్పటి 3వేల మందిని రక్షించాయ్ ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ, నేవీ బృందాలు. 80 డ్యామ్‌లకు భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. NDRF టీమ్స్ సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ మరికొందరు నీటిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో చూస్తుంటే కేరళ వాసులు ఎంత దీన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అర్థమవుతోంది. వరద నీటితో మా ఇళ్లంతా నిండిపోయిందని.. బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదని ఓ వ్యక్తి సెల్పీ వీడియో పోస్ట్ చేశాడు. దయచేసి నన్ను కాపాడండి  అంటూ కేరళ రాష్ట్ర అధికారులకు చెన్నంగూర్‌ కు చెందిన వ్యక్తి రిక్వెస్ట్ చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ నీటి లెవల్ పెరుగుతోందని.. ప్రస్తుతం తాను రెండో ఫ్లోర్ లో ఉన్నాను. ఇక్కడ కూడా నా తల వరకు నీరు వచ్చేసింది. అధికారులు గానీ, స్థానిక రాజకీయ నాయకులు గానీ ఒక్కరు కూడా ఇటువైపు రాలేదని చెప్పాడు. ఈ వీడియోను చూసైనా నన్ను కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

మెట్లు ఎక్కి బిల్డింగ్ పైకి వెళ్లేందుకు వీలున్నప్పటికీ.. తాను ఎంత డేంజర్ లో ఉన్నానో తెలిపేందుకే ఈ వీడియో చేస్తున్నానని చెప్పాడు బాధితుడు. ఇంటిగోడలు కూలిపోయి.. భవనం కుప్పకూలే ప్రమాదం ఉందని..  తమను కాపాడాలని ప్రాధేయపడుతున్న సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చివరికి అధికారుల దృష్టికి రావడంతో, రెస్క్యూ సిబ్బంది ఎలాగొలా రక్షించారు. ఇలాంటి దృశ్యాలు, కేరళలలో కొకొల్లలు. వీధులన్నీ నీటమునగడంతో, సహాయక సిబ్బంది, బోట్లలో జనాలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

English Title
Kerala floods: Man films selfie video asking for help while up to his neck in water

MORE FROM AUTHOR

RELATED ARTICLES