భోపాల్‌ ఎన్నికల సమీకరణాలు ఏం చెబుతున్నాయ్‌?

భోపాల్‌ ఎన్నికల సమీకరణాలు ఏం చెబుతున్నాయ్‌?
x
Highlights

ఒకరు హై ప్రొఫైల్‌ పొలిటికల్‌ లీడర్‌. ఇంకొకరు హై ప్రొజెక్టివ్‌ హిందూఈస్ట్‌. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అపర చాణక్యుడిగా పేరున్న డిగ్గిరాజాతో ఢీ అంటే ఢీ...

ఒకరు హై ప్రొఫైల్‌ పొలిటికల్‌ లీడర్‌. ఇంకొకరు హై ప్రొజెక్టివ్‌ హిందూఈస్ట్‌. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అపర చాణక్యుడిగా పేరున్న డిగ్గిరాజాతో ఢీ అంటే ఢీ అనబోతున్నారు సాధ్వీ ప్రజ్ఞ. పరోక్ష రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించిన ప్రజ్ఞ ప్రత్యక్ష రాజకీయాల్లో తలపండిన మేధావితో యుద్దం చేయబోతున్నారు. ఇంతకీ సాధ్వీ ప్రజ్ఞ ఎవరు? ఆమె ఎందుకింత వివాదాస్పదమయ్యారు.?

2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో అరెస్టయిన తర్వాత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరు మొదటిసారిగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. తగినన్ని సాక్ష్యాధారాలు లేవని ఎన్ఐఏ కోర్టు ప్రకటించడంతో గత ఏడాదే విడుదలయ్యారు. సాధ్వీ తన పదునైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వచ్చారు. ఆమె అప్పటి హోంమంత్రి చిదంబరం 'హిందూ ఉగ్రవాదం మాట అనడంపై తీవ్రంగా విమర్శించారు. 2018లో గుజరాత్‌లోని ఒక కార్యక్రమంలో సోనియాని ఇటలీకి చెందిన పనిమనిషి అని సంచలనం సృష్టించారు. హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులపై దాడి అంటూ ఆమె కాంగ్రెస్‌లోని పలువురు నేతలపై ఎన్నో విమర్శలు రువ్వారు. వీరిలో దిగ్విజయ్ కూడా ఉన్నారు. డిగ్గీ రాజా దేశద్రోహి అని, తన శత్రువు అని సాధ్వీ ఆరోపించారు. అందుకే వ్యూహాత్మకంగా సాధ్వీ ప్రజ్ఞాను బరిలో దింపింది.

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో జన్మించిన సాధ్వీ ప్రజ్ఞా తండ్రి ఒక ఆయుర్వేద డాక్టర్. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో పనిచేశారు. అందుకే ప్రజ్ఞా ఠాకూర్ చిన్ననాటి నుంచే సంఘ్ కార్యకలాపాల వైపు ఆకర్షితురాలయ్యారు. చరిత్రలో మాస్టర్స్ పట్టా పొందిన ప్రజ్ఞా సంఘ్‌తో అనుబంధం పెరిగిన తర్వాత సన్యాసం స్వీకరించారు. విద్యార్థి నాయకురాలైన ప్రజ్ఞా ఠాకూర్ హఠాత్తుగా ఏబీవీపీ వదిలేసి అవధేశానంద్ మహారాజ్ ప్రభావంతో సాధ్వీగా మారారు. గ్రామగ్రామానికి వెళ్లి హిందూత్వం ప్రచారం చేసేవారు. ఆమె సూరత్‌ను తన కార్యస్థలంగా ఎంచుకొని అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. హిందూత్వ ప్రచారం ఆమె బీజేపీ నేతలతో టచ్‌లో ఉంటూ వచ్చారు. మెల్లమెల్లగా రాజకీయాల్లో ఆమె స్థాయి పెరిగి ఇప్పుడు లోక్‌సభ టికెట్ దక్కింది.

చాలాకాలం రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఢిల్లీలో మకాం వేసిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు. 30 ఏళ్లుగా భోపాల్ నుంచి ఓటమి ఎరుగని బీజేపీ, మరోసారి విజయం సాధించాలని ఉరకలేస్తోంది. సాధ్వీ ప్రజ్ఞాకు అటు అధిష్ఠానం అండదండలతో పాటు ఇటు స్థానిక నాయకత్వం నుంచి పుష్కలంగా సహకారం లభించేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories