మరి కాసేపట్లో పోలవరానికి ఏపీ సీఎం జగన్‌

మరి కాసేపట్లో పోలవరానికి ఏపీ సీఎం జగన్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. ఏపీ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టును మరికాసేపట్లో...

ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. ఏపీ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టును మరికాసేపట్లో జగన్‌ సందర్శించనున్నారు. సీఎం హోదాలో... ఫస్ట్‌ టైమ్‌ పోలవరం పనులను పరిశీలించనున్న జగన్‌.... ప్రాజెక్టు కంప్లీట్‌కు కొత్త టార్గెట్‌ను నిర్దేశించనున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడంటోన్న జగన్మోహన్‌రెడ్డి... శరవేగంగా నిర్మాణం పూర్తిచేసేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంతో పాటు వైసీపీ నేతలు, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పోలవరం అథారిటీ కమిటీ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు వస్తున్నందున ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.

తొలి సమీక్షలోనే పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న జగన్‌... మొదటిసారి ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్నారు. సుమారు రెండున్నర గంట‌ల పాటు ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ వ‌ద్ద ఉంటారు..పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నులు జ‌రుగుతున్న తీరును సీఎం ప‌రిశీలించ‌నున్నారు..ఇరిగేషన్ రివ్యూలో పోలవరంపై ప్రత్యేకంగా వివరాలు అడిగిన వైఎస్ జగన్‌... ఎప్పటికి కంప్లీట్‌గా పూర్తి అవుతుందో కచ్చితమైన టైమ్‌ చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ఆఫీషియల్స్‌ అప్పటికప్పుడు చెప్పిన లెక్కలపై మండిపడ్డ జగన్మోహన్‌రెడ్డి... ప్రాజెక్టు దగ్గర వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఖ‌ర్చు పెట్టిన నిధుల‌ను కేంద్రం నుంచి తీసుకురావాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసారు సీఎం

పోలవరం ప్రాజెక్ట్ కు 11 వేల 537 కోట్లు ఖ‌ర్చు పెట్టిన రాష్ట్రం.. కేంద్రం నుంచి రావాల్సిన బ‌కాయిలు 4 వేల 810 కోట్లు నిధులు విడుద‌ల చేయాలంటూ కేంద్రాన్ని కోరింది. యూసీలు సివిల్ ప‌నుల‌కు 12 వేల కోట్లు..స‌హాయ పున‌రావాసానికి 27 వేల కోట్లు కావాల్సింది ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప్రాజెక్ట్ ప‌నులు 70 శాతం పూర్తి చేయగా... అందులో త‌వ్వకం ప‌నులు 85 శాతం,కాంక్రీట్ ప‌నులు 73 శాతం పూర్తి చేశారు. కుడి ప్రధాన కాల్వ 91 శాతం,ఎడ‌మ ప్రధాన కాల్వ 71 శాతం పూర్తి చేశారు. మొత్తం 39 ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నుల‌కు గాను 29 ల‌క్షల క్యూబిక్ మీట‌ల‌ర్ల పనులు పూర్తి చేశారు.మొత్తం 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉండ‌గా..ఈనెలాఖ‌రు కల్లా 35 మీటర్ల ఎత్తున నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు....

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ ల విష‌యంలో అవ‌స‌ర‌మైతే రీటెండ‌ర్ ల‌కు వెళ్లాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను సూచినట్లు సమాచారం. పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో ముఖ్యమంత్రి మ‌ళ్లీ రీటెండ‌ర్ ల‌కు వెళ్తార‌నే ప్రచారం జ‌రుగుతుంది.. అయితే ఇప్పటికే ప్రాజెక్ట్ ప‌నులు 70 శాతం పూర్తికావ‌డంతో టెండ‌ర్ల విష‌యంలో పున‌రాలోచ‌న ఉండ‌ద‌ని అంటున్నారు. ఇక స‌హాయ‌పున‌రావాస ప‌నులు కూడా మంద‌కొడిగా సాగుతున్నాయి..ఆర్ అండ్ ఆర్ కింద ప్రభుత్వం ఇప్పటికీ నిర్వాసితుల‌కు నిధులు చెల్లించ‌లేదు..దీంతో ముఖ్యమంత్రి ప‌ర్యట‌న‌...అక్కడి అధికారుల‌తో స‌మీక్ష త‌ర్వాత ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories