‘దట్టి’ కథ పై దుమ్మరేపిన కెసిఆర్..

‘దట్టి’ కథ పై దుమ్మరేపిన కెసిఆర్..
x
Highlights

టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారంలో భాగంగా రోజులాగానే ప్రజాఆశీర్వాద సభ నిర్వహించాడు అందరు అనుకున్నాట్టు ప్రసంగంలో కెసిఆర్ పథకాల...

టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారంలో భాగంగా రోజులాగానే ప్రజాఆశీర్వాద సభ నిర్వహించాడు అందరు అనుకున్నాట్టు ప్రసంగంలో కెసిఆర్ పథకాల గురించో, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తడేమో అనుకుంటారు కాని గియ్యాలా కెసిఆర్ నిర్మల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం ప్రచారానికి కాసేపు పక్కనపెట్టి ఓ ఆసక్తికరమైన కథ చెప్పారు. తన సమయం కాస్త వృథా అయినా సరే పర్లేదు అంటూ ముస్లిం సోదరులు కట్టే "దట్టి"కి ఉన్న ప్రత్యేకతను వివరించిన తీరు ప్రజల్ని మంత్నముగ్దుల్ని చేసిందనే చెప్పాలి. ‘అది దట్టి కాదు పట్టీ,, దానిని ఇమామే జామీన్‌ అంటారు.

మక్కాలో ప్రొఫెట్ మహమ్మద్ కు ఒక మనువడు ఉండేవాడు. అయితే ఒకరోజు ప్రవక్త మనువడు రోడ్డపంట నడుస్కుంట పొతాఉంటాడు పొంగా పొంగా దారి మధ్యలో ఓ వేటాగాడు జంకని పట్టుకొని సంపుదామని సుస్తడు అయితే ప్రవక్త మనువడు తెలివిగా కాసాయివాడి దగ్గరికి వెళ్లి ఓ కసాయి వాడితో జింక బోరుమని ఎందుకు గుక్కిగుక్కి ఎందుకు ఎడస్తుందో నీకు ఎరుకనా అని ధీనంగా కసాయి వాడిని అడిగాడు ప్రవక్త మనువడు దినికి కసాయివాడు పిల్లగాన్ని కిందికి మిదికి సుస్తడు. జింక ఎందుకు ఎడుస్తుందో అని చెబుతూ తన కన్న బిడ్డ ఆకలితో అలమటిస్తుంది తన బిడ్డకు పాలు ఇయ్యాలని భాద పడుతుంది. నువ్వు ఒక్కసారి ఆ జింకను వదిలిపెడితే తన బిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చివస్తుందని కసాయి వాడికి చెబుతాడు. ఇది విన్న కసాయివాడు అర్రె బలే మాట్లాడుతున్నావ్ గా అని కడుపుబ్బ నవ్వుతడు. జింక వదిలిపెట్టు అది మళ్లీ తిరిగి రాకపోతే నన్ను నరకమని చెబుతాడు ప్రవక్తమనుమడు. గి మాట విన్న కసాయి ఆశ్చర్యానికి గురై వింత సూసి, కొద్దిగంత ఆలోచింది సరే బిడ్డ అని నేను వదిలిపెడుతాను అని చెబుతాడు ఇదే సమయంలో ప్రవక్త మనువడు తన కీసాల ఉన్న రూమాలు(చేతి గుడ్డ) తీసి జింక కాలుకు కట్టి ఇడిశిపెడుతాడు. ఆ జింక కొద్దిసేపటికి తన బిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చి తిరిగి కసాయి దగ్గరికి వస్తుంది. దింతో ఒక్కసారిగా కంగుతీని ప్రవక్త మనువడి రెండు కాల్ల మీద పడి జింకను వదిలేస్తాడు. అంటే గిక్కడ మనం గమనించాల్సింది ఎంటిది అంటే క్షేమంగా వెళ్లి లాభంగా రా అని సుట్టాలు, పెద్దలు మనస్పుర్తిగా దీవించి కట్టేదే ఇమామ్ ఏ జామీన్ అని అది చాలా పవిత్రమైనదని కెసిఆర్ పూసగుచ్చినట్లు ప్రజలుకు కెసిఆర్ వివరిస్తాడు. అనంతరం మాట్లాడుతూ చాలా మందికి దీన్ని ఎందుకు కడతారో కూడా తెలియదని, రేపు మెడకు కడితే వాళ్లు కూడా మెడకు కడతారని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories