కాసేపట్లో అభ్యర్థుల తొలి జాబితా

Submitted by arun on Thu, 09/06/2018 - 14:50
kcr

తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దు అయిన నేపథ్యంలో మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించిన అనంతరం.. తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ జరిగే ప్రెస్ మీట్‌లో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు రావాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమై తదుపరి వ్యూహంపై చర్చిస్తున్నారు.

English Title
kcr talks with media at telangana bhavan

MORE FROM AUTHOR

RELATED ARTICLES