అబ్బా.. కండోమ్‌ని ఇలా కూడా వాడతారా..!

అబ్బా.. కండోమ్‌ని ఇలా కూడా వాడతారా..!
x
Highlights

కండోమ్ అంటే టక్కున గుర్తొచ్చేది..రొమాన్స్.. కండోమ్‌ని కేవలం సుఖ వ్యాదుల నుండి రక్షణ కోసం వాడుతారని చాలా మంది అనుకుంటారు.. కానీ ద్వీపదేశం క్యూబాలో...

కండోమ్ అంటే టక్కున గుర్తొచ్చేది..రొమాన్స్.. కండోమ్‌ని కేవలం సుఖ వ్యాదుల నుండి రక్షణ కోసం వాడుతారని చాలా మంది అనుకుంటారు.. కానీ ద్వీపదేశం క్యూబాలో కండోమ్‌ని శృంగారం కోసం మాత్రమే కాదు.. వేరే పనులకు కూడా వినియోగిస్తుంటారు. చదవటానికి విచిత్రంగా ఉన్న.. ఈ స్టోరీ మొత్తం చదివిన తర్వాత.. అబ్బా.. కండోమ్‌ని ఇలా కూడా వాడతారా అని ఆశ్చర్యపోతారు.

మన దగ్గర 1990 కాలంలో కొంత మంది పిల్లలు కండోమ్‌లును బెలూన్‌లా చేసుకుని ఆడుకున్న రోజులు.. కొద్ది మందికి గుర్తుఉండే ఉండవచ్చు.. అప్పట్లో జరిగిన ఇలాంటి విషయాలను గుర్తు చేసుకుంటే సరదాగా అనిపిస్తుంటుంది. కానీ క్యూబాలో ఇప్పటికీ కూడా కండోమ్‌లును బెలూన్‌లా అక్కడి యువకులు ఆడుకుంటూ ఉండటం విశేషం. మరి కొంత మంది యువకులు చేపలు పట్టే గేలాలకు కండోమ్‌లను వాడతుంటారు. మరీ యువకులు ఇలా ఉంటే.. అక్కడి కొంతమంది యువతులు వీటిని ఎలా వాడతున్నారో తెలిస్తే షాక్ అవుతారు.. ఎందుకంటే అక్కడి కొంత మంది అమ్మాయిలు కండోమ్‌లను హెయిర్ బ్యాండ్స్‌గా వాడుతుంటారు. ఇక్కడ వైన్ బాటిళ్లకు మూతగా కండోమ్‌లను వాడడం మరో విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories